DC OTT Release| ఆకేరు న్యూస్, సినిమా: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన సినిమా సిద్ధమైంది. అక్టోబర్ 16 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
మరోవైపు చంద్ర తన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఈ ముగ్గురి జీవితాలు ఒకదానితో మరొకటి ముడిపడటంతో ప్రేమ, నమ్మకం, ద్రోహం, ప్రతీకారం చుట్టూ కథ సాగుతుంది. అనూహ్య పరిణామాలు, పాత్రల మధ్య సంఘర్షణ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
భారీ తారాగణంతో సినిమా
అరుణ్ మాథేశ్వరన్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లోకేశ్ కనగరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించారు. సంజన కృష్ణమూర్తి, కస్తూరి రాజా, తలైవాసల్ విజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
థియేటర్లలో కాకుండా ఓటీటీలో సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఇది మరో ఆసక్తికరమైన ఎంపిక కానుంది. అక్టోబర్ 16 నుంచి సోనీ లివ్లో ఐదు భాషల్లో అందుబాటులోకి రానున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

