* గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని విజ్ఞప్తి
Perumandla Ramakrishna| ఆకేరు న్యూస్, ఢిల్లీ: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని తనకు కేటాయించాలని కోరుతూ పెరుమాండ్ల రామకృష్ణ రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి బయోడేటాను అందజేశారు.
వివిధ సంఘాల మద్దతు ఉందని వెల్లడి
రాష్ట్రవ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాలు, ప్రజా సంఘాల నుంచి తనకు మద్దతు లభిస్తోందని డా. రామకృష్ణ ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మాదిగ, దళిత, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యమకారుల సంఘాలు తనను ఎమ్మెల్సీగా బలపరుస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశాలు, వివిధ సంఘాలు తనకు మద్దతుగా చేసిన విజ్ఞప్తులకు సంబంధించిన వివరాలను రాహుల్ గాంధీకి అందజేసినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు సైతం తన పేరును ఎమ్మెల్సీ పదవికి పరిశీలించాలని కోరుతున్న విషయాన్ని వివరించినట్లు తెలిపారు.
సానుకూలంగా స్పందించారని వెల్లడి
తన విజ్ఞప్తిపై రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించినట్లు డా. పెరుమాండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. తన అభ్యర్థనను పరిశీలించినందుకు రాహుల్ గాంధీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అయితే, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

