Bhupalpally| ఆకేరు న్యూస్, భూపాలపల్లి: మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జే. జీవన్ కుమార్ మంగళవారం తీర్పు వెలువరించారు.
2021లో వెలుగులోకి వచ్చిన ఘటన
టేకుమట్ల మండలం మండలవారిపల్లి గ్రామానికి చెందిన 40 ఏళ్ల పాక్షికంగా మూగ, చెవిటి, మానసిక వైకల్యం ఉన్న మహిళ 2021 నవంబర్ 28న ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన బండి శంకర్ (55) ఆమె ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. అదే సమయంలో బాధితురాలి తల్లి అక్కడికి రావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి టేకుమట్ల ఎస్హెచ్ఓ, ఎస్ఐ కె. రమణారెడ్డి కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. వెంకట్ దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలతో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
కోర్టులో నేరం రుజువు
విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కోర్టు మానిటరింగ్ ఆఫీసర్, పీసీఆర్ ఇన్స్పెక్టర్ బి. రాజు పర్యవేక్షణలో కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్ఐ జి. వెంకన్న, కోర్టు కానిస్టేబుళ్లు సీహెచ్. జ్యోతి, పి. శ్వేత విచారణకు సంబంధించిన విధుల్లో పాల్గొన్నారు. భరోసా కేంద్రం లీగల్ సపోర్ట్ ఆఫీసర్ జి. రజిత సహకారం అందించారు.
విచారణ అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జే. జీవన్ కుమార్ పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన అప్పటి దర్యాప్తు అధికారులు, ప్రస్తుత భూపాలపల్లి డీఎస్పీ ఎ. సంపత్ రావు, చిట్యాల సీఐ సతీష్, ఎస్ఐ జి. అమూల్య, కోర్టు మానిటరింగ్ ఆఫీసర్ బి. రాజు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్ఐ జి. వెంకన్న, కోర్టు కానిస్టేబుళ్లు సీహెచ్. జ్యోతి, పి. శ్వేత, భరోసా కేంద్రం లీగల్ సపోర్ట్ ఆఫీసర్ జి. రజితలను భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

