* కేసీ వేణుగోపాల్‌ను కలిసిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
Perumandla Ramakrishna| ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుతూ పెరుమాండ్ల రామకృష్ణ పార్టీ అధిష్టానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థి దశలో ఎన్ఎస్యూఐ నుంచి ప్రారంభించి, కాంగ్రెస్ పార్టీ కోసం తాను చేసిన సేవలను ఆయన వివరించారు.
సేవలను వివరించిన రామకృష్ణ
పార్టీ కోసం తాను చేసిన కృషి, సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని రామకృష్ణ కోరారు. ఈ సందర్భంగా ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి సచిన్ సావంత్‌ను కూడా కలిసి తన విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు వివిధ ప్రజాసంఘాలు తనకు మద్దతుగా ఇచ్చిన లేఖలను, తన రాజకీయ అనుభవానికి సంబంధించిన బయోడేటాను కేసీ వేణుగోపాల్‌కు సమర్పించినట్లు తెలిపారు.
నాయకత్వంపై విశ్వాసం
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలు, నాయకుల సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజాసేవే లక్ష్యం
పదవులు కేవలం హోదాలు మాత్రమే కాదని, ప్రజలకు మరింత చేరువగా సేవ చేసే బాధ్యతలని రామకృష్ణ పేర్కొన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే పేద ప్రజలు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి మరింత విస్తృతంగా కృషి చేస్తానన్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు.
తన సుదీర్ఘ రాజకీయ సేవలను పార్టీ అధిష్టానం గుర్తించి సముచిత ప్రాధాన్యం కల్పిస్తుందనే నమ్మకం ఉందని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

