Rayaparthy| రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండల సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడిగా మహబూబ్నగర్ గ్రామ సర్పంచ్ పెండ్లి మహేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సర్పంచులు సర్వసమ్మతంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గం ఎంపిక
సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులుగా సూదుల ఉమాదేవి-దేవేందర్, దేదవత్ గోపాల్, గుగులోతు రమేష్, కందికట్ల స్వప్న-సంతోష్ ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తీగల సాయిలు, కోశాధికారిగా మునావత్ బాన్షా నాయక్, సంయుక్త కార్యదర్శిగా గుజే సుధాకర్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా గుగులోతు అక్క్రీ, షీలా-హేమలత రత్నాకర్ రెడ్డి, ముఖ్య సలహాదారులుగా మునావత్ సోమ్లా, గారే సహేంద్ర-బిక్షపతి ఎంపికయ్యారు.
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
ఈ సందర్భంగా ఎంపీడీవో పాక శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా సర్పంచులు చొరవ చూపాలని పేర్కొన్నారు.
నూతన అధ్యక్షుడు పెండ్లి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచులందరినీ సమన్వయం చేసుకుంటూ ఐక్యంగా పనిచేస్తామని తెలిపారు.
ఎస్సైకి మర్యాదపూర్వకంగా కలిసిన సభ్యులు
నూతన కార్యవర్గ ఎంపిక అనంతరం ఫోరం సభ్యులు రాయపర్తి పోలీస్ స్టేషన్ను సందర్శించి ఎస్సై ముత్యం రాజేందర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. నూతన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులను ఎస్సై అభినందించారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజా సంక్షేమానికి పోలీస్ శాఖ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు చినపాక రజిత, వాంకుడోత్ దేవేందర్, వంగాళా ఎల్లమ్మ, గుగులోతు సునీత, ఇస్లావత్ సంతోష్తో పాటు మండలంలోని పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

