PM Ajay Scheme
* రూ.20 లక్షల నిధులతో అభివృద్ధి పనులు
PM Ajay Scheme| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: పీఎం అజయ్ (ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన) పథకం ద్వారా వచ్చే నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని కొత్తపల్లి సర్పంచ్ ముక్కర స్వరూప రవి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామం పీఎం అజయ్ పథకానికి ఎంపికైన సందర్భంగా గురువారం ప్రత్యేక గ్రామ పంచాయతీ సమావేశాన్ని నిర్వహించారు.
రూ.20 లక్షలతో అభివృద్ధి పనులు
ఈ సందర్భంగా సర్పంచ్ స్వరూప రవి మాట్లాడుతూ.. పీఎం అజయ్ పథకం కింద గ్రామానికి రూ.20 లక్షల అభివృద్ధి నిధులు మంజూరవుతాయని తెలిపారు. ఈ నిధులతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రజల సహకారంతో అభివృద్ధి
గ్రామ అవసరాలను గుర్తించి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజల సహకారంతో నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని సర్పంచ్ సూచించారు. అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టి కొత్తపల్లిని మరింత అభివృద్ధి చెందిన గ్రామంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు.
సమావేశంలో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో ఉపసర్పంచ్ గోవింద కృష్ణయ్య, గ్రామ కార్యదర్శి తాండ్ర స్వప్న, వార్డు సభ్యులు మీర్జా అఫ్జల్ బేగ్, గోవిందు ఏసోబు, గోవిందు మనమ్మ, కనకం మౌనిక, ఎం. రాజయ్య, గోవిందు రజిత, గోవిందు కరుణ, మెరుగు రాజయ్య, బూరు మల్లేశం, కారోబార్ కుమారస్వామి తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

