* మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి..
* కౌన్సిలర్ పొన్న రాజేష్ పిలుపు
Saddula Bathukamma| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలంతా సమష్టిగా పాల్గొని ఘనంగా నిర్వహించుకోవాలని 8వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు రైతు వేదిక వద్ద బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.
సంప్రదాయబద్ధంగా వేడుకలు
ఈ సందర్భంగా పొన్న రాజేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో పండుగ సంబరాలను ఆనందంగా నిర్వహించాలని సూచించారు.
ప్రజల సహకారం అవసరం
పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సద్దుల బతుకమ్మ వేడుకలను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బూర్ల యాకయ్య, రామంచ రాజు, మాచర్ల బిక్షపతి, కోతి అజయ్, రంగు రాజయ్య, ఇప్పడు వెంకటేష్, రంగు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

