Harish rao Vs CM Revanth Reddy
* తెలంగాణ నీటిని తరలించే కుట్ర జరుగుతోంది..
* రాష్ట్రంలో కరువుకు సీఎం రేవంతే కారణం
* కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
* గోదావరి జలాల తరలింపుపై సంచలన ఆరోపణలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గోదావరి – కావేరి నదుల అనుసంధానం పేరుతో నీటిని తరలించే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి హరీశ్రావు సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, తాగుసాగునీటి అంశాలు, గోదావరి జలాల వివాదంపై ఆయన పలు కీలక విషయాలను ప్రస్తావించారు.
* ఏపీ కంటే తక్కువ వర్షపాతం ఉన్నా..
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో తక్కువ వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయని అయినప్పటికీ, అక్కడ ఎక్కడా క్రాప్ హాలిడే ప్రకటించలేదని హరీష్ రావు వెల్లడించారు. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వలనే కరువు పరిస్థితులు తలెత్తాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత దుస్థితికి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ప్రధాన కారణమని ఆయన మండిపడ్డారు. రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
* చంద్రబాబు లేఖతో..
గోదావరి నది నీటిని తెలంగాణకు దక్కకుండా చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి – కావేరి నదుల అనుసంధానం పేరుతో తెలంగాణ హక్కులను కాలరాస్తూ, నీటిని తరలించే కుట్రకు తెరలేపారని ఆయన ఆరోపించారు. అక్టోబర్ 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారని, ఆ లేఖలోని అంశాలను వెంటనే అజెండాలో చేర్చడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఏపీ సీఎం రాసిన ఈ లేఖ ద్వారా భవిష్యత్తులో తెలంగాణ రైతులకు తీవ్రమైన అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
* రాష్ట్ర రైతాంగానికి ముప్పు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ తాగు, సాగునీటి ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని హరీష్ రావు దుయ్యబట్టారు. గోదావరి జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులను కాపాడుకోవడానికి అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రస్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు రాసిన లేఖతో తెలంగాణ రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, తెలంగాణపై కుట్రలు పన్నితే అడ్డుకుంటామని హరీశ్రావు వెల్లడించారు.
* సురక్షితంగా నామినేషన్ల ప్రక్రియ
నామినేషన్లు సక్రమంగా జరిగేలా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారని, అభ్యర్థులను స్వయంగా నామినేషన్ కేంద్రానికి తీసుకెళ్లి సక్రమంగా నామినేషన్ వేసేందుకు పూర్తి భద్రత కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా సీసీటీవీ కెమెరాల కవరేజ్ ద్వారా పర్యవేక్షిస్తూ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఐజీ రాజకుమారి తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

