Kavya Maran Wedding Reception Telangana CM Revanth Reddy at his Jubilee Hills
* జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన కళానిధి మారన్ దంపతులు
* నవంబర్ 21న చెన్నైలో కావ్య మారన్–అనిరుధ్ రవిచందర్ రిసెప్షన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్, ఆయన సతీమణి జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో కలిశారు. తమ కుమార్తె కావ్య మారన్ వివాహ (Kavya Maran Wedding ) రిసెప్షన్‌కు హాజరు కావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు.
కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్ నవంబర్ 21న చెన్నైలో జరగనుంది. ఈ నేపథ్యంలో కళానిధి మారన్ దంపతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి వేడుకకు సంబంధించిన ఆహ్వానాన్ని అందజేశారు.
ఈ భేటీ సందర్భంగా తమ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు రావాలని ముఖ్యమంత్రిని కోరారు. సినీ, మీడియా రంగాలకు చెందిన ప్రముఖ కుటుంబంలో జరగనున్న ఈ వేడుకకు సంబంధించి ఆహ్వాన కార్యక్రమం జరిగింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

