Pallagutta| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పల్లగుట్ట సర్పంచ్ ఎనగందుల నరసింహారెడ్డి అన్నారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో ఆదివారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు యువతలో ఐకమత్యం, పట్టుదల, క్రమశిక్షణను పెంపొందించడంతో పాటు నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. పండుగల సందర్భంగా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా గ్రామీణ యువతలో ఉత్సాహం పెరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, మండల పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు, దేవస్థానం డైరెక్టర్ ఎలగందుల రత్నాకర్ రెడ్డి, సంపత్ రాజ్, జయప్రకాష్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఇస్రం శ్రీనివాస్, అనిల్, యువజన అధ్యక్షుడు ఇస్రం రాజుతో పాటు గ్రామ యువత పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

