DCP Rajamahendra Naik| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో విజయదశమి సందర్భంగా నిర్వహించనున్న రావణ దహన కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం డీసీపీ రాజమహేంద్ర నాయక్ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
స్టేషన్ ఘన్‌పూర్‌లోని సవారికుంట మైదానంలో 14వ వార్డు పరిధిలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 14వ వార్షిక రావణ దహన కార్యక్రమం ఏర్పాట్లను డీసీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజేష్‌తో కలిసి కార్యక్రమ ప్రాంగణాన్ని సందర్శించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా 14వ వార్డు కౌన్సిలర్ ప్రెషర్ కృష్ణవేణి సారయ్య మాట్లాడుతూ.. విజయదశమి రోజున నిర్వహించనున్న రావణ వధ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమ ఏర్పాట్లలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నీల రాజమ్మ గట్టయ్య, కో-ఆప్షన్ సభ్యులు బూర్ల లతా శంకర్, కిషోర్ చారి, గజ్జల రాజు, గడ్డాల శేఖర్, రాజారపు ఏలియా, అక్కపెళ్లి శీను, పొన్నాల స్వామి, మామిడాల శ్రీనివాస్, కొండ రవి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు ఆహ్వానం
విజయదశమి సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో నిర్వహించనున్న రావణ దహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. మున్సిపల్ చైర్మన్ తట్టుకొండ వినయ్ కుమార్‌తో పాటు గట్టు రమేష్, పెసరు సారయ్య, పొన్న రాజయ్య, తోకల రాజులు కలెక్టర్‌ను కలిసి వేడుకలకు హాజరుకావాలని కోరారు. దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

