Durga Mata| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు సోమవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు మండలంలోని తాటికొండలో శ్రీ కనకదుర్గ అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కనకదుర్గ కాలనీలో ప్రత్యేక పూజలు
స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ కాలనీలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పాసర్లపూడి లక్ష్మి, ఆలయ ఇన్చార్జి, అమ్మానాన్న ఫౌండేషన్ చైర్మన్ రేండ్ల సమ్మయ్య, కమిటీ సభ్యులు పాసర్లపూడి నాగరాజు, పాసర్లపూడి వివేక్ సిద్ధార్థ, మోటం నాగార్జున, మోటం కాలేష్, బాలకృష్ణ, పస్తం రాజు, పస్తం జీవన్, మోటం లక్ష్మీనరసింహ తదితరులు పాల్గొన్నారు. పూజారులు పాలకుర్తి కిషోర్ శర్మ, సోమేశ్వర శర్మ, దీక్షిత్ శర్మల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
తాటికొండలో భక్తుల సందడి
తాటికొండలో అర్చకుడు జీడికంటి వరుణాచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో పండగ బుచ్చయ్య, భవాని మాల స్వాములు పండగ రాజేశ్వర్, పర్శ రాజు, పండుగ సత్తయ్య, పండుగ రవి, అక్కెనపల్లి రాములు, మారపాక నాగరాజు, అక్కెనపల్లి రాకేష్, శ్రీపతి రాజు, నారబోయిన కార్తీక్, చిలువేరు వర్షిత, మొగ్గం ప్రవస్థి, మారపాక మానస తదితరులు పాల్గొన్నారు.
పలు ప్రాంతాల్లో ఘనంగా పూజలు
స్టేషన్ ఘన్ పూర్లోని శివాలయం ఎదురువీధి, బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు, ఆంజనేయస్వామి ఆలయం ముందు, చాగల్లో ప్రతిష్ఠించిన శ్రీ దుర్గామాత మండపాల్లోనూ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వడంతో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నవరాత్రి వేడుకలతో ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

