Southern States DGPs Meeting Telangana DGP (File Photo)
* హైదరాబాద్‌లో దక్షిణాది డీజీపీల భేటీ
* నేరాల కట్టడికి ఉమ్మడి వ్యూహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ సదస్సు (Southern States DGPs Meeting) నేడు హైదరాబాద్‌లో జరగనుంది. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించనున్న ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సదస్సులో సైబర్ నేరాలు, డ్రగ్స్ అక్రమ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణపై ప్రధానంగా చర్చించనున్నారు. అంతర్రాష్ట్ర ముఠాల కట్టడికి వివిధ రాష్ట్రాల పోలీసు శాఖల (Southern States DGPs Meeting) మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే అంశంపై అధికారులు దృష్టి సారించనున్నారు.
* నేర నియంత్రణే లక్ష్యం..
పోలీసింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం, మావోయిస్టుల ఏరివేత అనంతరం భద్రతా పరిస్థితులపై కూడా సమీక్షించనున్నారు. నేరాల నియంత్రణ, సమాచార మార్పిడి, ఉమ్మడి కార్యాచరణ ద్వారా సరిహద్దు దాటి జరిగే నేరాలను అరికట్టే వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.
దక్షిణాది రాష్ట్రాలతో పాటు లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరికి చెందిన డీజీపీలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), సీబీఐ, ఎన్ఐఏ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్కు చెందిన ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు.
దేశ భద్రత, అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణ, ఆధునిక సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌లో రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఈ సదస్సు కీలకంగా నిలవనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

