Warangal Lorry Accident
Published:
Updated: 23 Oct 2026 • 12:33 PM
* రోడ్డుపై చిందరవందరగా పైపులు
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్లోని ఉర్సు నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలోని బ్రిడ్జిపై భారీ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. గుజరాత్ నుంచి ఖమ్మం వెళ్తున్న ఈ వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో అందులో ఉన్న పైపులు రోడ్డుపై చిందరవందరగా పడిపోయాయి.
* ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం..
దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుపై పడిపోయిన పైపుల కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఈ వార్తకు సంబంధించిన బృందం

కరస్పాండెంట్
ఇనుగాల కిశోర్ , MA (Mass Communication )
12 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.

