Praveen Farmer Protest
* నీళ్లు లేవు.. కరెంటు లేదు.. ఎండిపోతున్న వరి పంట!
* ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు..
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి : సాగునీరు అందక.. విద్యుత్ సరఫరా లేక వరి పంట ఎండిపోతుండటంతో ఓ యువరైతు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. గణపురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్ తనకున్న మూడు ఎకరాల పొలంలో వరి పంట నీరు లేక వాడిపోతుండటాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశాడు. పంటకు నీరు అందకపోవడంతో ద్విచక్ర వాహనంపై పొలంలో తిరుగుతూ తన నిరసనను తెలియజేశాడు.
* సాగునీరు, విద్యుత్ కొరతతో ఇబ్బందులు
వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు సాగునీరు, విద్యుత్ సరఫరా కీలకంగా ఉంటాయి. అయితే తన మూడు ఎకరాల వరి పంటకు నీరు అందక, కరెంటు సమస్యతో పంట ఎండిపోతోందని రైతు ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. పంటను కాపాడుకునేందుకు అవసరమైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయాడు.
* పంటను కాపాడండి.. లేదంటే బతకలేనని ఆవేదన
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు సాగునీరు, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ప్రవీణ్ ఆరోపించాడు. తన పంటను కాపాడుకునేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీరు, విద్యుత్ అందించాలని కోరాడు. పంట చేతికందకపోతే తీవ్రంగా నష్టపోతానని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ తన బాధను వెల్లడించాడు.
మూడు ఎకరాల్లో సాగు చేసిన వరి పంట ఎండిపోతుండటంతో యువరైతు చేసిన ఈ నిరసన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి, రైతుకు అవసరమైన సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

