సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
* పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ నేతల పిలుపు
* కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లిలో సమావేశాలు
Station Ghanpur| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: ఖమ్మం–వరంగల్–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి గ్రామాల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, నమోదు ప్రక్రియపై పట్టభద్రులకు అవగాహన కల్పించాలని కోరారు.
గ్రామ శాఖల అధ్యక్షులు జంగిడి ప్రభాకర్, నరేష్, కీమానీల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమీద సురేష్ కుమార్, మాజీ ఎంపీపీ బొమ్మిశెట్టి సరితా బాలరాజు, యూత్ అధ్యక్షుడు కృష్ణ, మాజీ సర్పంచ్ ఎల్లయ్య, గాలి రాజు, శ్రీధర్, చంద్రమౌళి, అశోక్, శ్రీశైలం, తిరుపతి, గట్టయ్య, కృష్ణమూర్తి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

