ఆత్మకూర్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బరుపట్ల కిరీటి
* సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ వి. నరేందర్ రెడ్డి,
* పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, హనుమకొండ: పేదలకు వైద్య సేవలందిస్తూ, సామాజిక సేవలో తనదైన గుర్తింపు పొందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు సముచిత రాజకీయ గుర్తింపు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం సామాజిక సేవా రంగంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవిని ఆయనకు కేటాయించాలని కోరారు.
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వి. నరేందర్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు కాంగ్రెస్ నాయకులు అర్జీ సమర్పించారు. నిరుపేదలకు వైద్య సేవలందించడంతో పాటు దళితులు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ రామకృష్ణ చేస్తున్న కృషిని గుర్తించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, దళిత రత్న అవార్డు గ్రహీత బరుపట్ల కిరీటి మాట్లాడుతూ.. డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కేవలం వైద్యుడిగానే కాకుండా సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తున్నారని అన్నారు. వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణతో పాటు పేదలకు అందిస్తున్న వైద్య, సామాజిక సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న వ్యక్తులకు చట్టసభల్లో అవకాశం కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూరుతుందని కిరీటి అభిప్రాయపడ్డారు. డాక్టర్ రామకృష్ణ సుదీర్ఘకాలంగా అందిస్తున్న సామాజిక సేవలను, బహుజన సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలను రాష్ట్ర నాయకత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ సేవలకు తగిన గుర్తింపు లభించేలా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించే అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

