సాయం అందజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు
* వైద్య ఖర్చుల కోసం రూ.10 వేల అందజేత
* వెలికట్టలో బాధిత కుటుంబాలకు పరామర్శ
Thorrur| ఆకేరు న్యూస్, తొర్రూరు: ఆపదలో ఉన్న నిరుపేదలకు అండగా నిలుస్తూ కాంగ్రెస్ నాయకులు మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన కిడ్నీ బాధితుడు బండ నారాయణకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.
వైద్యానికి సాయం
వెలికట్ట గ్రామంలోని హరిజన కాలనీకి చెందిన బండ నారాయణ రెండు కిడ్నీలు దెబ్బతినడంతో కొంతకాలంగా డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. నిరుపేద కుటుంబానికి వైద్య ఖర్చులు భారంగా మారిన విషయాన్ని తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి స్పందించి బాధితుడికి సహాయం అందించాలని సూచించారు.
ఆమె ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు మాలోత్ సునీత–రాజేందర్ దంపతులు నారాయణ ఇంటికి వెళ్లి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
అదే పర్యటనలో భాగంగా గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పలువురి కుటుంబాలను కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఆర్థిక సహాయం అందించి ధైర్యం చెప్పారు. గ్రామ ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలవడం తమ బాధ్యతని నాయకులు పేర్కొన్నారు.
పలువురు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ అల్లంనేని అనిల్ రావు, వార్డు సభ్యులు వీరమనేని రమేష్ రావు, సోమరపు ఐలయ్య, భోగ కమలాకర్, బంధు వెంకన్న, మాలోత్ యాకుబ్, రవి, రాములు, యాకయ్య, వడ్లకొండ వెంకన్న తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

