* అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండడమే ముఖ్యం
* ఆయన ఎవరితో తిరిగినా అభ్యంతరం లేదు
* శ్రీను నాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు : దువ్వాడ వాణి
ఆకేరు న్యూస్, టెక్కలి : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(Mlc Duvvada Srinu) ఫ్యామిలీ ఎపిసోడ్ ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పట్లో ఈ వివాదానికి ఎండ్ కార్డు పడే అవకాశాలు కనిపించడం లేదు. దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య, కుమార్తె ల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ అవి ఫలించడం లేదు. దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఇంటి ఎదుట అతని భార్య వాణి(Vani), ఇద్దరు కుమార్తెల నిరసన 10వ రోజుకు చేరుకుంది. దువ్వాడ శ్రీనివాసు, అతని భార్య వాణి మధ్య రాజీకోసం కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో దువ్వాడ నివాసం ఉండే కొత్త ఇంటి ఎదుటే కారు సెడ్ లో వాణి, ఆమె కుమార్తెలు హైందవి, నవీనలు నిరసన తెలుపుతున్నారు. కొత్త ఇంట్లోనే ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఉంటున్నాడు. అతని వద్దకు తమ్ముడు శ్రీధర్ వచ్చి వెళ్తున్నాడు.
ఆయన ఎవరితో తిరిగినా అభ్యంతరం లేదు..
తాజాగా దువ్వాడ వాణి (Duvvada Vani)కొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చారు. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండడమ ముఖ్యమన్నారు. అందుకు దువ్వాడ శ్రీను ఎలాంటి షరతులు పెట్టినా ఓకే అన్నారు. ఆయన ఎవరితో తిరిగినా తనకు సంబంధం లేదని చెప్పారు. రాజకీయాలు, ఆస్తులు అక్కర్లేదన్నారు. పిల్లల భవిష్యత్ కోసం ఒకే ఇంట్లో కలిసి ఉండడమే తమకు కావాల్సిందని చెప్పారు. తమ మధ్య పెద్ద మనుషులు అక్కర్లేదన్నారు. కాగా, ఇంటి లోపలే దువ్వాడ శ్రీను(Duvvada Srinu), బయట కారు షెడ్డులో భార్య, పిల్లలు పది రోజులుగా అలాగే ఉండిపోయారు.
————————–