మెగావర్స్ మూవీ
* ‘మెగావర్స్’ షూటింగ్ ప్రారంభం
Megastar Chiranjeevi| ఆకేరు న్యూస్, డెస్క్: మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. వెండితెరపై దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. ఇప్పుడు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ‘గావర్స్ టాక్ షో షూటింగ్ ప్రారంభమైంది.
ప్రముఖులతో ముచ్చట్లు
‘మెగావర్స్’ కార్యక్రమంలో చిరంజీవి తనదైన శైలి, హాస్యం, ఆత్మీయతతో ప్రేక్షకులను అలరించనున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విభిన్న తరాలకు చెందిన స్టార్స్‌తో ఆయన ఆసక్తికరమైన సంభాషణలు జరపనున్నారు. వారి జీవిత ప్రయాణాలు, అనుభవాలు, విశేషాలను ఈ వేదిక ద్వారా ప్రేక్షకులతో పంచుకోనున్నారు.
చిరంజీవి సహజమైన సంభాషణా శైలి, చమత్కారమైన మాటలు, ఆకట్టుకునే వ్యక్తిత్వం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటివరకు వెండితెరపై తనదైన ముద్ర వేసిన మెగాస్టార్.. టాక్ షో ద్వారా డిజిటల్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
ముగ్గురు నిర్మాణ భాగస్వాములు
‘మెగావర్స్’ కార్యక్రమాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, ఎస్ఓఎల్ ప్రొడక్షన్ ఎల్ఎల్పీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ షో చిత్రీకరణ కొనసాగుతోంది.
అయితే, కార్యక్రమం ఎప్పుడు స్ట్రీమింగ్కు రానుంది? తొలి ఎపిసోడ్లో ఎవరెవరు పాల్గొననున్నారు? వంటి వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే షోకు సంబంధించిన మరిన్ని విశేషాలు ప్రకటించే అవకాశం ఉంది.
చిరంజీవి తొలిసారిగా నెట్‌ఫ్లిక్స్ వేదికపై టాక్ షోతో సందడి చేయనుండటంతో ‘మెగావర్స్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

