హీరో సుమన్
Suman| ఆకేరు న్యూస్, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు సుమన్‌కు 2026 సంవత్సరానికి గాను ‘కత్తి కాంతారావు జాతీయ పురస్కారం’ ప్రదానం చేయనున్నారు. తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ఈ అవార్డుకు ఆయనను ఎంపిక చేశాయి.
నవంబర్ 16న అవార్డు
కళాప్రపూర్ణ కత్తి కాంతారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సినీ ప్రముఖులను సత్కరిస్తూ ఈ జాతీయ పురస్కారాలను అందిస్తున్నారు. గత 24 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 16న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో సుమన్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు.
విభిన్న పాత్రలు
సుమారు 300కు పైగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన సుమన్ తనదైన శైలితో ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకున్నారు. యాక్షన్ హీరోగా, కరాటే యోధుడిగా, డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా విభిన్న పాత్రల్లో అలరించారు. పౌరాణిక పాత్రల్లోనూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడి పాత్రల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు.
కమిటీ ప్రకటన
సుమన్ సినీ రంగానికి అందించిన సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ ప్రతినిధులు తెలిపారు. కమిటీ చైర్మన్ కె.వి. రమణాచారి (రిటైర్డ్ ఐఏఎస్), సి. పార్థసారథి (రిటైర్డ్ ఐఏఎస్), నాగబాల డి. సురేష్ కుమార్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

