Vijayawada Flights Cancelled
* విజయవాడ నుంచి 10 విమానాలు క్యాన్సిల్
* భారీ వర్షాలతో విమాన రాకపోకలకు అంతరాయం
* 10 సర్వీసులు క్యాన్సిల్!
ఆకేరు న్యూస్, డెస్క్ : మురసు తుపాను ప్రభావం విమాన సర్వీసులపైనా పడింది. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి నడవాల్సిన ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేశారు. సోమవారం (నవంబర్ 2) గన్నవరం నుంచి బయలుదేరాల్సిన 10 ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
* హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, చెన్నై ప్రయాణికులకు ఇబ్బందులు
తుపాను కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లే ప్రయాణికులపై ప్రభావం పడింది. విమానాల రద్దు, ఆలస్యాలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులు తమ విమాన సర్వీసుల తాజా సమాచారాన్ని ఇండిగో అధికారిక వెబ్సైట్, యాప్ ద్వారా తెలుసుకోవాలని సూచించారు. విమానాశ్రయానికి వెళ్లే ముందు సర్వీసు నడుస్తుందో లేదో నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

