PACS Director Vemula Laxman Goud (File Photo)
* జనగామ జిల్లాలో విషాదం
ఆకేరు న్యూస్, జనగామ జిల్లా : బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన పీఏసీఎస్ (PACS) డైరెక్టర్ వేముల లక్ష్మణ్ గౌడ్ వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
* అప్పుల భారం, వరి పంట ఎండిపోవడంతో మనోవేదన..
ఇటీవల సాగు చేసిన వరి పంట ఎండిపోవడం మరియు విపరీతమైన అప్పుల భారం కారణంగా ఆయన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ మనోవేదనతోనే ఆయన అలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

