* అతి త్వరలో అధికారిక ప్రకటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : టీపీసీసీ కొత్త చీఫ్(TPCC NeW Chief)గా మహేష్‌కుమార్‌గౌడ్(Maheshkumar Goud) పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఎంపికపై ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే(Kharge), అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahulgandhi)తో టీ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. దాదాపు గంట పాటు సమావేశం సాగింది. పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణపై భేటీలో ప్రధానంగా చర్చ సాగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీపీసీసీ కొత్త చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. మహేష్‌కుమార్ గౌడ్కుమార్ పేరును రెండ్రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపిక తుది కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్(Cm Revanth), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy Dm Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Utham Kumarreddy(లతో నేడు ఏఐసీసీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ ముగ్గురి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత తుది నిర్ణయం ప్రకటించనున్నారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియామకంలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. పార్టీకి ఇప్పటికే తన అభిప్రాయం స్పష్టం చేసానని..టీపీసీసీ చీఫ్ గా ఎవరిని నియిమించినా తనకు అభ్యంతరం లేదని రేవంత్ స్పష్టం చేసారు. బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్(Madhuyaski goud), టీపీసీసీ కొత్త చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్(Mahesh kumar Goud) ,ఎస్సీ వర్గం నుంచి విప్ అడ్లూరి లక్ష్మణ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎస్టీ వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు ఉన్నట్టు తెలిసింది. మహేష్ కుమార్ గౌడ్ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం వస్తోంది.
———————-