అభ్యాస హైస్కూల్ విద్యార్థినులు
* వరంగల్‌లో జరిగిన పోటీల్లో ప్రతిభ
* రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
Abhyasa High School| ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ నగరంలోని బిర్లా స్కూల్లో నిర్వహించిన 32వ జాతీయ బాలల సైన్స్ ఫెయిర్‌లో అభ్యాస హైస్కూల్ విద్యార్థినులు ప్రతిభ చాటారు. ఇబా ఇరహం, గంజి అక్షరల బృందం వినూత్న ప్రదర్శనతో ఆకట్టుకుని రాష్ట్ర స్థాయి బాలల సైన్స్ ఫెయిర్‌కు ఎంపికైంది.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మీర్జా అఖిల్ ఉల్లా బెగ్ ఎంపికైన విద్యార్థినులను అభినందించారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి పాఠశాలకు, వరంగల్ నగరానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
విద్యార్థినులకు మార్గదర్శకత్వం వహించిన గైడ్ ఉపాధ్యాయులు సంతోష్, సబ్బీర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మండల శిరీష మాట్లాడుతూ.. విద్యార్థులు ఎంచుకున్న ప్రాజెక్టు అంశం సమాజానికి అవసరమైనదని, వినూత్న ఆలోచనతో రూపొందించిన ప్రదర్శనను వారు ప్రతిభావంతంగా వివరించారని ప్రశంసించారు.
ఈ అభినందన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

