ఐలేష్ యాదవ్
Baikani Ailesh Yadav| ఆకేరు న్యూస్, పాలకుర్తి: మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడిగా బైకాని ఐలేష్ యాదవ్ మరోసారి నియమితులయ్యారు. తనపై నమ్మకంతో మరోసారి ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
నాయకులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని ఐలేష్ యాదవ్ తెలిపారు. బీసీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి సమష్టిగా ముందుకు సాగుతానన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులైన బీసీ వర్గాల ప్రజలకు చేరవేయడంలో చురుకైన పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.
ఐలేష్ యాదవ్ మరోసారి బీసీ సెల్ అధ్యక్షుడిగా నియమితులు కావడంతో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

