Telangana Education Department
* 78 పోస్టులు మినిస్టీరియల్ సిబ్బందికే
* DEO ఆఫీసుల్లో APO, ASO పోస్టులు ఇక వారికే
ఆకేరు న్యూస్, డెస్క్ : డీఈవో కార్యాలయాలు, డైట్ (DIET)ల్లోని పలు పోస్టుల కేటాయింపులో విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కొన్ని పోస్టుల్లో ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. ఇకపై వాటిని విద్యాశాఖ మినిస్టీరియల్ సిబ్బందితో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీవో (APO), ఏఎస్వో (ASO) పోస్టులను మినిస్టీరియల్ సిబ్బందికే కేటాయించారు.
డీఈవో కార్యాలయాల్లోని ఏపీవో, ఏఎస్వో పోస్టులకు ఇకపై జూనియర్, సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్లను డిప్యూటేషన్ విధానంలో నియమించనున్నారు. ప్రస్తుతం ఈ పోస్టుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల స్థానంలో మినిస్టీరియల్ సిబ్బందికి అవకాశం కల్పించనున్నారు.
అలాగే డైట్ కళాశాలల్లోని స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్లకు, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను సూపరింటెండెంట్లకు కేటాయించారు. ఈ మార్పుల్లో భాగంగా డీఈవో కార్యాలయాల్లో 26 ఏపీవో, 26 ఏఎస్వో పోస్టులు, డైట్లలో 13 స్టాటిస్టికల్ అసిస్టెంట్, 13 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు కలిపి మొత్తం 78 పోస్టులను మినిస్టీరియల్ సిబ్బందికి కేటాయించారు. ఈ నిర్ణయంతో విద్యాశాఖలోని మినిస్టీరియల్ సిబ్బందికి ఆయా పోస్టుల్లో పనిచేసే అవకాశం కలగనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

