Jayashankar Bhupalpally Crime
* మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి పరార్
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి ఓ వివాహిత తన భర్తను హత్య చేసినట్లు సమాచారం.
* ఇంట్లోనే దారుణ హత్య..
ఇంట్లోనే భర్తను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని చికెన్ పల్లి సమీపంలో పడేసి నిందితులు పరారైనట్లు తెలుస్తోంది.
* భార్య, ప్రియుడి కోసం పోలీసుల గాలింపు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడు సంతోష్ కోసం గాలిస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

