Indiramma Houses
* 19,119 కుటుంబాలకు మంజూరు
* 37,825 పూరిళ్ల కుటుంబాల గుర్తింపు
ఆకేరు న్యూస్, డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో గుడిసెలు, పూరిళ్లలో నివాసం ఉంటున్న కుటుంబాలకు ప్రాధాన్యం కల్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు నిర్వహించిన సర్వే ఆధారంగా ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి, అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేశారు.
అధికారులు గుర్తించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 37,825 కుటుంబాలు ఎలాంటి పక్కా నివాస సదుపాయం లేకుండా పూరిళ్లలో జీవనం సాగిస్తున్నాయి. వీరిలో ఇప్పటివరకు 19,119 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. మిగిలిన దరఖాస్తులు ప్రస్తుతం అధికారుల విచారణలో ఉన్నాయి.
జిల్లాల వారీగా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 10,038 కుటుంబాలకు ఇళ్లు మంజూరయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 3,604 ఇళ్లను కేటాయించారు. మిగిలిన అర్హుల దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి మంజూరుపై చర్యలు తీసుకోనున్నారు. పూరిళ్లలో నివసిస్తున్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సొంత ఇల్లు లేని నిరుపేదలకు నివాస సదుపాయం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

