ECI Voter Registration Technical Issue
* ఈసీఐ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు
* 50 శాతం కూడా పూర్తికాని నమోదు
* ఓటు నమోదు కోసం పట్టభద్రుల ఇబ్బందులు
ఆకేరు న్యూస్, డెస్క్ : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియకు సాంకేతిక సమస్యలు ఆటంకంగా మారాయి. గత వారం రోజులుగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెబ్సైట్లో ఇబ్బందులు తలెత్తుతుండటంతో పట్టభద్రులు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.
* ఓటు నమోదు కోసం పట్టభద్రుల ఇబ్బందులు..
అయితే వెబ్సైట్లో సాంకేతిక సమస్యల కారణంగా ఆశించిన స్థాయిలో నమోదు జరగడం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు మొత్తం నమోదు ప్రక్రియ 50 శాతం కూడా పూర్తికాలేదని సమాచారం. వెబ్సైట్లో సమస్యలతో దరఖాస్తు చేసుకోవాలనుకునే పట్టభద్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యలను పరిష్కరించే పనిలో ఉన్నామని ఎన్నికల సంఘం చెబుతోంది. సాంకేతిక అడ్డంకులు తొలగితే ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

