Dammanapeta MEO Office Protest
* దమ్మన్నపేట పాఠశాలలో నియామకాల వివాదం
ఆకేరు న్యూస్, వరంగల్ : ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ బాధితులు ఆందోళనకు దిగారు. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాలలో జరిగిన నియామకాల్లో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఎంఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాలల్లో బడీడు పిల్లలను చేర్పించాలనే ఉద్దేశంతో గౌరవ వేతన ప్రాతిపదికన ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పాటు ఎంపికైన వారికి శిక్షణ కూడా ఇచ్చారు.
* పోస్టుల భర్తీపై విచారణకు డిమాండ్..
శిక్షణ పూర్తయిన తర్వాత అర్హత కలిగిన నిజమైన అభ్యర్థులను పక్కనపెట్టి, నిబంధనలకు విరుద్ధంగా అనర్హులను ఎంపిక చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నియామకాల్లో జరిగిన అవకతవకలపై అధికారులు వెంటనే స్పందించాలని బాధితులు డిమాండ్ చేశారు.
సమగ్ర విచారణ జరిపి, ఎంపిక ప్రక్రియలో జరిగిన తప్పులను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. అర్హులైన స్థానిక అభ్యర్థులకు న్యాయం చేయాలని ఎంఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నియామకాల్లో నిజంగా అక్రమాలు జరిగాయా? అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరుగుతుందా? అనే అంశాలపై అధికారుల స్పందన కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

