IOCL 500 Apprentice Jobs
* అప్రెంటిస్ పోస్టుల భర్తీ
* దరఖాస్తులు ప్రారంభం
* డిసెంబర్ 5 చివరి తేదీ
ఆకేరు న్యూస్, డెస్క్ : నిరుద్యోగ యువతకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) శుభవార్త అందించింది. సంస్థలోని పైప్లైన్స్ విభాగంలో 500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సమాచారం. టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* నవంబర్ 6 నుంచి దరఖాస్తులు
ఈ పోస్టులకు నవంబర్ 6, 2026 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 5, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది.
* మెరిట్ ఆధారంగా ఎంపిక
అభ్యర్థుల విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు అప్రెంటిస్ శిక్షణ అందించనున్నారు.
* నిరుద్యోగులకు మంచి అవకాశం
IOCLలో అప్రెంటిస్ శిక్షణ పొందాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. దరఖాస్తు చేసే ముందు విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.
అధికారిక వెబ్సైట్: https://www.iocl.com/apprenticeships

Please tell us what is wrong. Your report will be sent to the website team.

