Jangaon Teaching Jobs
* 6 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు.. నవంబర్ 6 చివరి తేదీ
* ఐఐటీ, నీట్ కోచింగ్ కోసం అధ్యాపకుల ఎంపిక..
ఆకేరు న్యూస్, జనగామ : బోధనా రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు జనగామ జిల్లా విద్యాశాఖ కొత్త అవకాశం కల్పిస్తోంది. కొడకండ్లలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ అందించేందుకు ఆరుగురు గెస్ట్ ఫ్యాకల్టీని నియమించనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు.
* ఏయే సబ్జెక్టుల్లో ఖాళీలు
మొత్తం ఆరు పోస్టులను సబ్జెక్టుల వారీగా కేటాయించారు. మ్యాథమెటిక్స్ ఏ, బీ విభాగాలకు కలిపి రెండు పోస్టులు ఉండగా.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు ఒక్కో పోస్టు చొప్పున ఉన్నాయి. ఎంపికైన అధ్యాపకులు ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు అవసరమైన శిక్షణ అందించాల్సి ఉంటుంది.
* ఎవరెవరు అర్హులు
సంబంధిత సబ్జెక్టులో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జెట్, గేట్, నెట్ లేదా సంబంధిత అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. బోధనలో అనుభవం ఉన్నవారికి ఎంపిక సమయంలో వెసులుబాటు ఉండనుంది.
* దరఖాస్తుకు నవంబర్ 6 చివరి తేదీ
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 3 నుంచి నవంబర్ 6, 2026 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తులను జనగామ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో లేదా కొడకండ్ల తెలంగాణ మోడల్ స్కూల్లో సమర్పించాలి.
* ఎంపిక ఎలా ఉంటుంది
అభ్యర్థుల విద్యార్హతలు, బోధనా అనుభవం, ఇంటర్వ్యూ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. ఇది పార్ట్‌టైమ్ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం. ఎంపికైన వారికి గంటకు రూ.650 చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నారు.
* పూర్తి వివరాలు ఎక్కడ తెలుసుకోవాలి
దరఖాస్తు చేయాలనుకునే వారు అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి. జనగామ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లోని రిక్రూట్మెంట్ విభాగంలో నోటిఫికేషన్ అందుబాటులో ఉంది.
అధికారిక వెబ్సైట్ : https://jangaon.telangana.gov.in/notice_category/recruitment/

Please tell us what is wrong. Your report will be sent to the website team.

