Bhilwara Road Accident
* దర్శనం చేసుకుని వస్తుండగా లోయలో పడిన కారు
* మహిళా కార్మికురాలు సహా ముగ్గురు దుర్మరణం
Bhilwara Road Accident| ఆకేరు న్యూస్, డెస్క్: రాజస్థాన్‌లోని భిల్వాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సాన్వ్రియా సేథ్ ఆలయ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న కుటుంబానికి చెందిన కారు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మహిళా కార్మికురాలితో పాటు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
ట్యాంకర్‌ను ఢీకొట్టి లోయలోకి..
మెనాల్ సమీపంలోని జాతీయ రహదారిపై ఓవర్‌బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు పక్కన నీటి ట్యాంకర్‌ను నిలిపి ఉంచారు. అటుగా వస్తున్న కారు ఒక్కసారిగా ట్యాంకర్‌ను ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న లోతైన లోయలో పడిపోయింది. సమీపంలో నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు.
మహిళ సహా ముగ్గురు మృతి
ఈ ప్రమాదంలో ప్రేమ్ బాయి (బిలానాబడి), బిహారీ, మండల్గఢ్కు చెందిన సావతా లాల్ ఓడ్ మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో మండల్‌గఢ్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన వారిని భిల్వాడ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు.
భద్రతా ఏర్పాట్లపై ఆగ్రహం
ప్రమాదం నేపథ్యంలో నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైవేపై పనులు జరుగుతున్నప్పటికీ హెచ్చరిక బోర్డులు, తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆరోపిస్తున్నారు. రహదారిపై ట్యాంకర్‌ను నిలిపి ఉంచడం కూడా ప్రమాదానికి కారణమై ఉండవచ్చని విమర్శిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

