Gadchiroli Tigers Crossing Road in Maharashtra
* వాహనదారుల కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యం
ఆకేరు న్యూస్, మహారాష్ట్ర : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఓ అరుదైన దృశ్యం స్థానిక వాహనదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. నిత్యం వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే రహదారిపై పులులు ఎంతో దర్జాగా, ప్రశాంతంగా రోడ్డు దాటాయి.
* వైరల్గా మారిన వీడియోలు..
అటుగా వెళ్తున్న వాహనదారులు ఈ దృశ్యాన్ని చూసి తమ వాహనాలను వెంటనే నిలిపివేశారు. పులులు రోడ్డు దాటుతుండగా కొంతమంది తమ సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
* వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి..
అడవులకు సమీపంలో ఉండే రహదారులపై ప్రయాణించేటప్పుడు అటవీ జంతువులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా, వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

