రెజీనా
* దీపావళి సందర్భంగా పోస్టర్ విడుదల
* ఆసక్తి రేపుతున్న రెజీనా లుక్
Regina Cassandra| ఆకేరు న్యూస్, సినిమా: హీరోయిన్ రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘RX’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు చెందిన G Squad సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. మిస్టరీని తలపించేలా ఉన్న ఈ పోస్టర్ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
మిస్టరీ లుక్!
‘ట్రూత్ ఆల్వేస్ డిమాండ్స్ ఎ వాయిస్ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్లో రెజీనా మస్టర్డ్ ఎల్లో కలర్ చీరలో కనిపిస్తున్నారు. రద్దీగా ఉన్న రైలులో ప్రయాణికుల మధ్య నిలబడిన ఆమె గంభీరమైన లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పోస్టర్‌పై కనిపిస్తున్న ECG తరహా గీతలు సినిమాపై మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. కథలో మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలు కీలకంగా ఉండనున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
విశాల్ వెంకట్ దర్శకత్వం
‘సిల నేరంగళిల్ సిల మనిధర్గల్’, బాంబ్ చిత్రాలతో గుర్తింపు పొందిన విశాల్ వెంకట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హరిహరన్ రాజు అందించిన కథకు ఆశమీర అయ్యప్పన్ సంభాషణలు రాశారు. రెజీనా కసాండ్రాతో పాటు నాజర్, రమేష్ తిలక్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రముఖ సాంకేతిక బృందం
ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఎస్.కె. సెల్వకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, జి.కె. ప్రసన్న ఎడిటర్‌గా, కె. మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
చెన్నైలో షూటింగ్ పూర్తి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్.. లోకేష్ కనగరాజ్‌కు చెందిన G Squadతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ భూపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సినిమా చిత్రీకరణ మొత్తం చెన్నైలో పూర్తయినట్లు చిత్ర బృందం వెల్లడించింది. త్వరలోనే విడుదల తేదీతో పాటు ఇతర వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. రెజీనా విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్న ‘RX’ ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుందో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

