పవన్ కల్యాణ్, అన్నా లెజ్నోవా (ఫైల్ చిత్రం)
* అన్నా లెజ్ నోవాతో 13 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు
* పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయం
* గతంలో నందిని, రేణు దేశాయ్‌తో ముగిసిన వివాహ బంధాలు
* అన్నాతో విడిపోవడానికి కారణాలు వెల్లడించని పవన్..
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan ) , ఆయన భార్య అన్నా లెజ్ నావా (Anna Lezhneva) విడిపోతున్నట్లు (Separation ) ప్రకటించారు. సుమారు 13 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం పరస్పర అవగాహన, గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నవంబరు 9 రాత్రి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు. జనసేన అధికారిక మీడియా వాట్సాప్ గ్రూపు లో ఈ ప్రకటన విడుదల చేశారు.
* పిల్లల బాధ్యతలు ఉమ్మడిగానే…
వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నప్పటికీ, స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తూ పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతలను నిర్వర్తిస్తామని పవన్, అన్నా తెలిపారు. పిల్లల సంతోషం, సంక్షేమానికి ఎప్పుడూ ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. ఈ వ్యక్తిగత పరిణామం సమయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ప్రజలను, శ్రేయోభిలాషులను కోరారు. విడిపోవడానికి దారితీసిన కారణాలను ఆప్రకటనలో వెల్లడించలేదు. పిల్లల సంరక్షణకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలనూ ప్రకటించలేదు. కుటుంబ న్యాయస్థానంలో విడాకుల పిటిషన్ దాఖలైనట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
* 1997లో వివాహం మొదటి వివాహం..
పవన్ కల్యాణ్ మొదటి భార్య నందిని విశాఖపట్నానికి చెందినవారు. పవన్ కళ్యాణ్‌తో నందినికి 1997లో వివాహమైంది. అనంతరం విడిగా జీవించిన వీరి వివాహ బంధం 2008లో విడాకులతో ముగిసింది. నందిని సినీరంగానికి చెందిన వ్యక్తి కాదు. అనంతరం ఆమె వేరే వక్తిని వివాహం చేసుకుని కుటుంబ జీవితంతో హాయిగా ఉన్నట్లు సమాచారం .. వీరికి సంతానం ఉన్నట్లు సమాచారం లేదు.. పెళ్ళయిన కొద్ది కాలానికే ఇద్దరి మద్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు..
* రెండో భార్య రేణు దేశాయ్… నటిగా, దర్శకురాలిగా గుర్తింపు
మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన రేణు దేశాయ్ ( Renu Desai ) మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, నటిగా గుర్తింపు పొందారు. పవన్ కల్యాణ్‌తో కలిసి బద్రి (Badri ) – (2000), జానీ (Johny ) – (2003) చిత్రాల్లో నటించారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పనిచేశారు. తరువాత నిర్మాతగా మారి, 2014లో విడుదలైన మరాఠీ చిత్రం ఇష్క్ వాలా లవ్ ( Ishkwala Love ) కు దర్శకత్వం వహించారు.పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌కు 2009లో వివాహమైంది. వీరి వివాహ బంధం 2012లో విడాకులతో ముగిసింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు అకీరా నందన్ (Akhira Nandan ) 2004లో, కుమార్తె ఆద్య ( Adhya ) 2010లో జన్మించారు.
* ఎవరీ అన్నా లెజ్నోవా ..?
అన్నా లెజ్నోవా రష్యా జాతీయురాలు. మోడల్, నటిగా పనిచేసిన ఆమె 1980లో రష్యాలో జన్మించారు. ‘తీన్మార్’ ( Teenmar ) సినిమా చిత్రీకరణ సమయంలో 2011లో పవన్ కల్యాణ్‌తో పరిచయం ఏర్పడినట్లు గతంలో అన్నా , పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పరిచయం అనంతరం 2013 సెప్టెంబరులో వీరు వివాహం చేసుకున్నారు. అన్నాలెజ్ నోవా విద్యాధికురాలు . రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్య అధ్యయనాల్లో ఆనర్స్ డిగ్రీ పూర్తిచేశారు. ఆసియా చరిత్ర, భాషలు, జీవన విధానాలపై అధ్యయనం చేసిన ఆమె, 2024లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా అందుకున్నారు. సింగపూర్‌లో జరిగిన పట్టా ప్రదానోత్సవానికి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.
* అన్నా కుటుంబంలో పిల్లల వివరాలు
అన్నా కుటుంబంలో కుమార్తె పొలేనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నారు. మార్క్ శంకర్ 2017 అక్టోబరులో జన్మించారు.కాగా విడిపోవడానికి కారణాలపై అదనపు వివరాలు వెల్లడించలేదు. తాజా సంయుక్త ప్రకటనలో మాత్రం పిల్లల పట్ల తల్లిదండ్రులుగా ఉమ్మడి బాధ్యతను కొనసాగిస్తామని తెలిపారు..
* రాజకీయ అంశంగా మారే అవకాశం..
కారణాలేమైనప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ – అన్నా లెజ్ నోవాల విడాకుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారే అవకాశం లేకపోలేదు.. గతంలో వైయస్సార్ సీపీ అధినేత తన రాజకీయ ప్రసంగాల్లో పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిల్ల గురించి ప్రస్తావిస్తూ పలుమార్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదే స్థాయిలో ఇతర వైయస్సార్ సీపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రంగా మూడు పెళ్ళిల్ల అంశాన్ని వాడుకున్నారు.. పవన్ కళ్యాణ్ అప్పట్లో తాను మూడు పెళ్ళిల్లు చట్టబద్దంగానే చేసుకున్నాను.. విడిపోయాము.. కొంత మంది రాజకీయ నాయకుల లాగా రహస్య సంబంధాలను కొనసాగించడం లేదంటూ తన పై వచ్చిన విమర్శలను తిప్పికొట్టేవారు.. ఇపుడు పవన్ కళ్యాణ్ మూడో సారి విడాకులు కూడా రాజకీయ అంశంగా మారే అవకాశం లేక పోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..

Please tell us what is wrong. Your report will be sent to the website team.

