కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
* భట్టి విక్రమార్క చేతుల మీదుగా భవన నిర్మాణానికి శ్రీకారం
* ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
Kazipet| ఆకేరు న్యూస్, కాజీపేట: హనుమకొండ జిల్లా కాజీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) నూతన భవన నిర్మాణానికి నేడు (బుధవారం) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
కాజీపేటలోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాలుర వసతిగృహం ప్రాంగణంలో ఈ పాఠశాల భవనాన్ని నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మంగళవారం పరిశీలించారు.
పాఠశాల నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాన్ని అధికారులతో కలిసి సందర్శించిన కలెక్టర్.. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
విద్యారంగ అభివృద్ధికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం మరో ముందడుగుగా నిలవనుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేష్, టీఎస్డబ్ల్యూఐడీసీ ఈఈ అరుణ్ కుమార్, కాజీపేట తహసీల్దార్ రాజు, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

