పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
* రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్ష
Warangal Police| ఆకేరు న్యూస్, వరంగల్: రాష్ట్రస్థాయి పోలీస్ క్రికెట్ పోటీల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ జట్టు సత్తా చాటాలని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆకాంక్షించారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న 5వ రాష్ట్రస్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరఫున క్రికెట్ జట్టు పాల్గొననుంది.
ఈ పోటీల కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రికెట్ జట్టును ఎంపిక చేశారు. జట్టుకు గీసుగొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ నాయకత్వం వహించనున్నారు.
ఈ సందర్భంగా ఎంపికైన క్రికెట్ జట్టు సభ్యులను పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాస్ఫూర్తితో ఆడి, అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. పోటీల్లో విజయం సాధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ జట్టు సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

