హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్. రవి
* జిల్లా స్థాయి ఎం.జె.పి బాలికల క్రీడాపోటీలు ప్రారంభం
Kamalapur| ఆకేరు న్యూస్, కమలాపూర్: చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్. రవి అన్నారు.
బుధవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు పరిధిలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎం.జె.పి బాలికల పాఠశాలలు, కళాశాలల అండర్-14, అండర్-17, అండర్-19 వార్షిక క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ ఎన్. రవి క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, ఆరోగ్యంగా ఉంటూ తమకు నచ్చిన రంగంలో కృషి చేస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ కుమార్, ఎం.జె.పి హనుమకొండ జిల్లా డి.సి.ఓ స్టెల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా డి.సి.ఓలు, ఆతిథ్య పాఠశాల ప్రిన్సిపాల్ సౌజన్య, వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్, వ్యాయామ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

