Collector Borkhade Hemant Sahadev Rao congratulated Nikhil Vajja
* ములుగు యువకుడికి కలెక్టర్ అభినందనలు
ఆకేరు, న్యూస్ ములుగు: గోవాలో నిర్వహించిన ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ పోటీల్లో ప్రతిభ చాటిన ములుగు జిల్లా యువకుడు వజ్జా నిఖిల్‌ను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అభినందించారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో నిఖిల్ జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ములుగు మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన నిఖిల్ గోవాలో ఇటీవల నిర్వహించిన ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ పోటీల్లో 1.9 కిలోమీటర్ల ఈత, 90 కిలోమీటర్ల సైక్లింగ్, 21.1 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి సత్తా చాటారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టుదల, క్రమశిక్షణతో కృషి చేస్తే క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు.
నిఖిల్ సాధించిన విజయం జిల్లాలోని యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి ములుగు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

