ఎర్రబెల్లి దయాకర్ రావు
* నాలుగు కాంగ్రెస్ కుటుంబాలు బీఆర్ఎస్లో చేరిక
* ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో గులాబీ కండువాలు
Palakurthi| ఆకేరు న్యూస్, పాలకుర్తి: పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పాలకుర్తి మండలం శాతాపురం గ్రామానికి చెందిన నాలుగు కాంగ్రెస్ కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఐలేని సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
రాష్ట్ర మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో కాంగ్రెస్ కుటుంబాల సభ్యులు గులాబీ కండువాలు కప్పుకుని బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజలంతా తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్, మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, పాలకుర్తి పట్టణ సర్పంచ్ కమ్మగాని విజయ-నాగన్న గౌడ్, పార్టీ ఉపాధ్యక్షుడు పాము శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఏలూరి కృష్ణమూర్తి, ఆనగంటి సోమ నరసయ్య, గన్న కృష్ణమూర్తి, వేల్పుల అనిల్, నాయిని నర్సిరెడ్డి, ఐలేని యాకం రెడ్డి, బీరెల్లి రవివర్మ, పసులాది పోశయ్య తదితర మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

