Dark Chocolate Movie
* ప్రేక్షకులకు మెమరబుల్ ఎక్స్పీరియన్స్ – విశ్వదేవ్ రాచకొండ
* రొటీన్‌కు భిన్నమైన కథతో వస్తున్నాం..
* కంటెంట్‌పై పూర్తి నమ్మకం ఉందన్న చిత్రబృందం
ఆకేరు న్యూస్, సినిమా : విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డార్క్ చాక్లెట్’. శశాంక్ శ్రీవాస్తవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్‌కు మంచి స్పందన లభించింది. నవంబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో విశ్వదేవ్ రాచకొండ మాట్లాడుతూ.. ‘డార్క్ చాక్లెట్’ను ఎంతో ప్యాషన్‌తో, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా రూపొందించామని తెలిపారు. సినిమా విషయంలో తమకు ఉన్న నమ్మకమే ఇంత ఆనందంగా ఉండటానికి కారణమన్నారు.
“కచ్చితంగా ఒక మంచి సినిమాను తీశాం. ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా ఇది. ఇప్పటివరకు ఈ సినిమా చూసినవాళ్లు మర్చిపోలేకపోతున్నారు. మళ్లీ మళ్లీ చూడాలనుకుంటున్నారు. మేము కచ్చితంగా ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం. అది నవంబర్ 13న మీరు చూడబోతున్నారు” అని విశ్వదేవ్ అన్నారు. ఇది రొటీన్ సినిమా కాదని, సినిమా అనే ఫార్మాట్‌కే సవాల్ విసిరేంత కొత్తగా దర్శకుడు శశాంక్ కథను రూపొందించారని చెప్పారు. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో మిస్ కావద్దని కోరారు.
* శశాంక్ కథ చెప్పే విధానం ప్రత్యేకం – రవికాంత్
దర్శకుడు రవికాంత్ మాట్లాడుతూ.. శశాంక్ కథ చెప్పే విధానం, నటీనటులను ఎంపిక చేసుకున్న తీరు చాలా కొత్తగా ఉన్నాయని ప్రశంసించారు. విశ్వదేవ్ ‘35’ వంటి చిత్రాలు చేయడం గర్వంగా ఉందన్నారు. శశాంక్‌కు ప్రత్యేకమైన అభిరుచి ఉందని, ఎంతో నమ్మకంతో ఈ సినిమాను తెరకెక్కించారని చెప్పారు. తామంతా వైజాగ్ నుంచి వచ్చామని, ఈ సినిమా అందరూ గర్వపడేలా ఉంటుందని నమ్ముతున్నట్లు తెలిపారు.
* విశ్వదేవ్కు రెండు నేషనల్ అవార్డులు రావడం గొప్ప విషయం – ఆదిత్య
దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ.. రెండు జాతీయ అవార్డులు అందుకున్న విశ్వదేవ్కు అభినందనలు తెలిపారు. బిందు మాధవి మంచి నటి అని, విశ్వదేవ్ వైవిధ్యమైన పాత్రలు చేయగల నటుడని పేర్కొన్నారు. సినిమా ప్రచార కంటెంట్ ఆసక్తికరంగా ఉందని, చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
* ‘డార్క్ చాక్లెట్’ చాలా కొత్తగా ఉంటుంది – మల్లిక్ రామ్
దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. శశాంక్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆయన కథలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయని, ‘డార్క్ చాక్లెట్’ కూడా కొత్త తరహాలో ఉండబోతోందని అన్నారు. విశ్వదేవ్ వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారని ప్రశంసించారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకున్నారు.
* మా కంటెంట్‌పై మాకు నమ్మకం ఉంది – బిందు మాధవి
హీరోయిన్ బిందు మాధవి మాట్లాడుతూ.. ఈ వారం విడుదలవుతున్న సినిమాలన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ‘డార్క్ చాక్లెట్’ చాలా కొత్త తరహా సినిమా అని చెప్పారు. అమెరికాలో ఈ చిత్రం ముందుగానే విడుదల కానుందని, సినిమా చూసిన ప్రేక్షకులు నిజాయితీగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. తమ కంటెంట్‌పై పూర్తి నమ్మకం ఉందని, తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
* విశ్వదేవ్ లేకపోతే ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు – శశాంక్
దర్శకుడు శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సినిమా చేయడానికి ఎంతో ధైర్యం కావాలని సినిమా చూసినవాళ్లు అంటున్నారని చెప్పారు. అయితే కథ రాసిన సమయంలో తనకు ఆ విషయం తెలియదన్నారు. “విశ్వదేవ్ లేకపోతే ఈ జర్నీ సాధ్యపడేది కాదు. బిందు తన పాత్రను అద్భుతంగా చేశారు. విశ్వదేవ్ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. వివేక్ సాగర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు” అని శశాంక్ పేర్కొన్నారు. ఒక తెలుగు సినిమా మూడు రోజుల ముందుగానే అమెరికాలో విడుదల కావడం గర్వంగా ఉందని, అందుకే ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుందని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సినిమా విజయాన్ని ఆకాంక్షించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

