కిష్టాపురం గ్రామ సర్పంచ్ కొండం రంగారెడ్డి
* అభివృద్ధిలో విద్యార్థుల భాగస్వామ్యానికి పిలుపు!
* సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికపై చర్చ
ఆకేరు న్యూస్, రాయపర్తి: సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, రేపటి పౌరులైన పిల్లలు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కిష్టాపురం గ్రామ సర్పంచ్ కొండం రంగారెడ్డి పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బాలల స్నేహపూర్వక గ్రామం (Child Friendly Village) అనే అంశంపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి సర్పంచ్ కొండం రంగారెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని బాలల సమస్యలు, వారి హక్కులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పిల్లల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. బాలల నుంచి వచ్చిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక (Action Plan) రూపొందించడంపై సమావేశంలో ప్రత్యేకంగా దృష్టి సారించారు.
పిల్లల సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ తరఫున ప్రాధాన్యతనిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ కొండం రంగారెడ్డి తెలిపారు. గ్రామాభివృద్ధిలో విద్యార్థుల అభిప్రాయాలకు కూడా తగిన ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తోట, సోమ నరసయ్య, వార్డు సభ్యులు కేమిడి యాదయ్య, గిద్దె వెంకటయ్య, తాళ్లపెల్లి బాబు, చెవున బోయిన పద్మ, ఈదునూరి కళ్యాణి, కునుసోతు జ్యోతి, గిద్దె రజిత, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎస్. లక్ష్మీదేవి, గ్రామ పెద్దలు, కారోబార్ గిద్దె మహిపాల్, అంగన్వాడీ టీచర్, ఆయా, ఆశా వర్కర్ కత్తి సంధ్య, గ్రామ సిబ్బంది సనిగినేని మదర్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

