ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి
ఆకేరు న్యూస్, రాయపర్తి: మండలంలోని నూతన పింఛన్ల లబ్ధిదారులకు శుభవార్త. రాయపర్తి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో (MPDO Office) సోమవారం, నవంబర్ 16న నూతన చేయూత, ఆసరా పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేయనున్నారు.
ఈ విషయాన్ని రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి వెల్లడించారు. కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, సర్పంచులు, అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు, పింఛన్ల లబ్ధిదారులు, పార్టీ కార్యకర్తలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

