Snapchat Drug Trafficking
* 900 మంది కస్టమర్లు!
* ఓజీ కుష్ (OG Kush), గంజాయి స్వాధీనం..
* సోషల్ మీడియా ఖాతాలపై పోలీసుల నిఘా
ఆకేరు న్యూస్, డెస్క్: హైదరాబాద్‌లో సోషల్ మీడియా (Social Media) వేదికగా సాగుతున్న డ్రగ్స్ అక్రమ వ్యాపారాన్ని పోలీసులు ఛేదించారు. స్నాప్‌చాట్ (Snapchat) ద్వారా కస్టమర్లను సంప్రదిస్తూ ఓజీ కుష్ (OG Kush), గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.240 కిలోల గంజాయి, 16.59 గ్రాముల ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మణికొండలోని ల్యాంకో హిల్స్ ప్రాంతం నుంచి కారులో డ్రగ్స్ తరలిస్తుండగా నిందితులను పట్టుకున్నారు. వీరు స్నాప్‌చాట్‌లో ‘OGdude420’, ‘Dude OG 420’ పేర్లతో ఖాతాలు నిర్వహిస్తూ మత్తు పదార్థాల విక్రయాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ సోషల్ మీడియా ఖాతాల ద్వారా సుమారు 800 నుంచి 900 మంది కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఆన్లైన్ వేదికగా కస్టమర్లను సంప్రదించడం, ఆర్డర్లు తీసుకోవడం, వారికి డ్రగ్స్ చేరవేయడం వంటి కార్యకలాపాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ అక్రమ వ్యాపారం వెనుక మరెవరైనా ఉన్నారా? నిందితులకు డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉంది? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని సాగుతున్న డ్రగ్స్ దందాపై ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
Also Read: నిమ్స్‌లో అక్రమాల కలకలం..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

