అరెస్టు (ఫైల్ ఫోటో)
* ఐదు రాష్ట్రాలకు సవాల్.. హైదరాబాద్‌లో పట్టివేత
* ఇద్దరు కేరళ డ్రగ్స్ పెడ్లర్లు అరెస్ట్
* 51 గ్రాముల MDMA స్వాధీనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో కీలక నిందితులు పట్టుబడ్డారు. ఐదు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారినట్లు చెబుతున్న డ్రగ్స్ కింగ్‌పిన్ అబ్దుల్ మిషాల్‌ను (kingpin Abdul Mishal) ఫ్యూచర్ సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నం పరిధిలో మహేశ్వరం ఎస్ఓటీ, ఇబ్రహీంపట్నం పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.
కేరళ రాష్ట్రానికి చెందిన అబ్దుల్ మిషాల్ (kingpin Abdul Mishal) (33), తారిఖ్ (25) అనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు 51 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
* బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ దందా?
పోలీసుల ప్రాథమిక విచారణలో అబ్దుల్ మిషాల్ బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్టు వార్తా కథనాలు వెల్లడించాయి. ఎండీఎంఏ తయారీతో పాటు కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా? డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
Read Also : యాదగిరిగుట్టలో ప్రమాదం..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

