వధువు మేఘనకు ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆత్మీయ ఆశీర్వాదం
* వధువు మేఘనకు ఆత్మీయ ఆశీర్వాదం
* కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా వేడుక
ఆకేరు న్యూస్, రాయపర్తి : మండలంలోని కొలనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణమాచార్యులు కుమార్తె మేఘన పెళ్లికూతురు వేడుక (Bride Ceremony) ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య ఈ శుభకార్యం జరిగింది.
* ముఖ్య అతిథిగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి..
ఈ వేడుకకు టీపీసీసీ (TPCC) వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి (Jhansi Rajender Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేడుకలో పాల్గొని సందడి చేశారు. పెళ్లికూతురు మేఘనను ఆప్యాయంగా పలకరించి, పూలమాలలు, అక్షింతలతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
* నూతన వధూవరులకు శుభాకాంక్షలు..
ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి (Jhansi Rajender Reddy) మాట్లాడుతూ.. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న మేఘనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నూతన వధూవరులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
అనంతరం కృష్ణమాచార్యులు కుటుంబ సభ్యులతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయంగా ముచ్చటించారు. వేడుకలో ఉత్సాహంగా పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read : కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో చోరీ..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

