ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ వైర్ మాయం
* ప్రారంభోత్సవానికి ముందే ఘటన
* నూతన సత్రం ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ వైర్ మాయం
* నేడు వర్చువల్‌గా సత్రాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఆకేరు న్యూస్, కొమురవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి (Komuravelli) మల్లన్న ఆలయ పరిధిలో చోరీ ఘటన కలకలం రేపింది. బంగడుగుట్టపై నూతనంగా నిర్మించిన 50 గదుల సత్రానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కాపర్ వైర్‌ను అపహరించారు. సత్రం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
* భక్తుల సౌకర్యార్థం నూతన సత్రం..
కొమురవెల్లి (Komuravelli) మల్లన్న క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం బంగడుగుట్టపై 50 గదులతో నూతన సత్రాన్ని నిర్మించారు. ఈ సత్రాన్ని శుక్రవారం (నవంబర్ 20) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలోనే సత్రానికి విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ వైర్ చోరీకి గురైనట్లు గుర్తించారు.
Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన నటి!
* పోలీసులు దర్యాప్తు..
చోరీ ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. ప్రారంభోత్సవానికి ముందే నూతన సత్రంలో చోరీ జరగడం స్థానికంగా చర్చకు దారితీసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.


1 thought on “Komuravelli | కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో చోరీ..!”