యూనివర్సిటీలో అసిస్టెంట్ ఉద్యోగాలు
* నవంబర్ 30 వరకు దరఖాస్తుకు అవకాశం
* డిగ్రీతో పాటు రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి
* ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక
ఆకేరు న్యూస్, డెస్క్: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) శుభవార్త చెప్పింది. యూనివర్సిటీలో 215 అసిస్టెంట్ ఉద్యోగాల (Assistant Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. తొలుత నవంబర్ 19గా నిర్ణయించిన దరఖాస్తుల గడువును తాజాగా నవంబర్ 30, 2026 వరకు పొడిగించింది. దీంతో ఆసక్తి ఉన్న అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునేందుకు మరింత సమయం లభించింది.
* మొత్తం 215 ఖాళీలు..
ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University Recruitment) విడుదల చేసిన ప్రకటన నంబర్ R&P/325/2026 ప్రకారం మొత్తం 215 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 164, ఎస్సీ (SC) అభ్యర్థులకు 33, ఎస్టీ (ST) అభ్యర్థులకు 18 పోస్టులు కేటాయించారు. ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-4 (Pay Level-4) ప్రకారం వేతనం చెల్లిస్తారు.
* విద్యార్హతలు ఇవే..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (Bachelor’s Degree) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం (Work Experience) తప్పనిసరిగా ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీ టైపింగ్లో నిమిషానికి 30 పదాల వేగం కలిగి ఉండాలి. వీటితో పాటు కంప్యూటర్ అప్లికేషన్లపై అవగాహన ఉండాలి.
* వయోపరిమితి, దరఖాస్తు విధానం..
ఈ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి (Age Limit) 32 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఢిల్లీ యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ (Official Website) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
* ఎంపిక ప్రక్రియ..
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ పరీక్ష (Preliminary Exam), మెయిన్స్ పరీక్ష (Mains Exam) నిర్వహిస్తారు. అనంతరం అర్హత ఆధారిత స్కిల్ టెస్ట్, టైపింగ్ పరీక్ష నిర్వహించడంతో పాటు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.
ప్రిలిమినరీ పరీక్షలో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కుల చొప్పున నెగెటివ్ మార్కింగ్ (Negative Marking) ఉంటుంది.
* ముఖ్యమైన తేదీ..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ 30, 2026. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు పూర్తి విద్యార్హతలు, దరఖాస్తు ఫీజు, పరీక్ష విధానం, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.
అధికారిక వెబ్సైట్: www.du.ac.in
Also Read : తెలంగాణలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు

Please tell us what is wrong. Your report will be sent to the website team.

